V1News Telangana

best news portal development company in india

లింభాభిలో ఉంగరం జయకేతనం… గ్రామంలో పండుగ వాతావరణం..

SHARE:

, నిర్మల్ జిల్లా, డిసెంబర్ 14: కుంటాల మండలంలోని లింభాభి గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉంగరం గుర్తు భారీ విజయం సాధించడంతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది.

ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ సుహాసిని రవీందర్ మాట్లాడుతూ గ్రామానికి సేవ చేసే అవకాశం కల్పించిన గ్రామ ప్రజలకు పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయానని, ఈసారి అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు తన జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.

గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రతి సమస్యను వాడవాడకు తిరిగి తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. లింభాభి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామ ప్రజల మనసుల్లో నిలిచిపోయే సేవలు చేస్తానని, ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎవరికైనా ఏ సమస్య వచ్చినా ముందుండి చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి మాటను తప్పకుండా నిలబెట్టుకుంటానని, మాట ఇచ్చి తప్పే మనిషిని కాదని, మాటమీద నిలబడే వ్యక్తినని తెలిపారు. ప్రతి వాడలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను ప్రాధాన్యతగా పూర్తి చేస్తానని పేర్కొన్నారు. గ్రామ ప్రజల కష్టసుఖాల్లో ఎల్లవేళలా తోడుగా ఉంటూ అవసరమైనప్పుడు దగ్గరుండి సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india