బోధన్ టౌన్
బోధన్ పట్టణంలోని రకాసిపేట్ భీముని గుట్ట ప్రాంతంలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వామికి ఆరట్టు ఉత్సవాన్ని ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి రథం పై ఉంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు స్వామివారి ఊరేగింపు ర తాన్ని బోధన్ ఎసిపి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు ఈ ఊరేగింపు అయ్యప్ప స్వామి ఆలయం నుండి ప్రారంభమై రాకాసిపేట్ మీదుగా పట్టణ శివారు ప్రాంతం లోని పసుపు వాగు వరకు ఊరేగింపు కొనసాగించి పసుపు వాగు ను పంపానదిగా భావిస్తూ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని అందులో జలకలాడించారు ఊరేగింపు కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు ఒంటిపై రంగులు పూసుకొని నృత్యాలు చేస్తూ, స్వామివారికి అభిషేకములు, పడిపూజ,నిర్వహించారు అనంతరం భిక్షా కార్యక్రమాన్ని స్వాములు తిరుమల్ రెడ్డి మల్లికార్జున్రెడ్డి. కృష్ణారెడ్డి. ఓంకార్ రెడ్డి. నల్లమోము వశిష్ట. భిక్ష ధాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకటనారాయణ అయ్యప్ప సేవ సమితి ట్రస్ట్ అధ్యక్షులు శివన్నారాయణ కార్యదర్శి ఐ ఆర్ చక్రవర్తి కోశాధికారి కొయ్యాడ శ్రీనివాస్ ప్రతినిధులు పావులూరి వెంకటేశ్వరరావు విజయ్ కుమార్ గౌడ్ బ్రహ్మయ్య గోవింద్ రెడ్డి గురుస్వాములు భక్తులు పాల్గొన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








