నసురుల్లాబాద్ ప్రతినిధి:
V1 న్యూస్, డిసెంబర్ (10)కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో గల తెలంగాణ షిర్డీగా ప్రసిద్ధి చెందిన సాయిబాబా ఆలయాన్ని మంగళవారం రోజు తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఆఫ్ అమెరికా బృందం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో గల ఆలయాలను సందర్శించి ఈనెల 25న శిల్పకళా వేదికలో వివిధ రంగాలలో రాణించిన కళాకారులకు మరియు విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఆలయాలు చాలా ఉన్నాయని భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలను సందర్శిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడవడం సంతృప్తినిస్తుందని వారు పేర్కొన్నారు. విద్యార్థులు చదువులలో బాగా రాణించే విధంగా మరియు వివిధ రంగాలలో పనిచేసే వారి నైపుణ్యాలను వెలికి తీసి ప్రపంచానికి తెలియజేసే విధంగా వారిని ప్రోత్సహించాలని సదుద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఆఫ్ అమెరికా చైర్మన్ విజయ్ పాల్ రెడ్డి,NRI పట్లోళ్ల మోహన్ రెడ్డి, అధ్యక్షుడు డా.ఎల్ఎన్ రెడ్డి, ప్రవీణ్ చింతల,జాయింట్ సెక్రెటరీ స్వాతి, వైస్ ప్రెసిడెంట్ నరసింహా పెరిక, సంగీతారెడ్డి, రమ్యాకుమారి, ట్రస్టు సభ్యులు విజయ్ కుమార్ రెడ్డి, వెంకటరమణ రెడ్డి, బాల్ రాజ్, రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








