రుద్రూర్ గ్రామంలో గత పది సంవత్సరాల క్రితం కటికే రాజారాం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని స్వీకరించరు. అయితే ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో రాజారాం తనయుడైన కటికే రామరాజు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో రుద్రూర్ గ్రామ ప్రజలు తనను ఆశీర్వదిస్తే కులం మతం తేడా లేకుండా రుద్రూర్ గ్రామ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా భావించి పేదవారిని ముందంజలో తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తానని కటికే రామరాజు స్పష్టంగా చెబుతున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి ఓటు వేస్తే జీవితాంతం గ్రామ ప్రజలకు సేవలు అందించడానికి నేను సిద్ధం అంటూ తనకిది న్యాయ పోరాటం అని గ్రామ ప్రజల మీద తనకు నమ్మకం ఉందని అంతర్గతంగా తనకు మద్దతిస్తామని చెప్పిన ప్రజల నమ్మకం మీదనే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని సర్పంచ్ అభ్యర్థి అయిన కటికే రామరాజు తెలిపారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








