ఏంచా గ్రామంలో రహస్యంగా భారీ పేకాట… యువత భవిష్యత్తు అంధకారంలోకి!
నవీపేట్ మండలంలోని ఏంచా గ్రామ పరిసరాల్లో రహస్యంగా భారీ స్థాయిలో పేకాట నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం లభించింది. గ్రామానికి చెందిన నాగ గ్యాంగ్ నేతృత్వంలో పంట పొలాలను కేంద్రంగా చేసుకొని ఈ అక్రమ జూద కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పేకాట ఆడేందుకు వచ్చే వారికి డబ్బులు సరిపోకపోతే, అధిక వడ్డీకే అప్పులు ఇస్తూ, వ్యక్తిగత వాహనాలు, బంగారపు నగలు బాండుగా ఉంచించే పరిస్థితి సృష్టిస్తున్నారని తెలుస్తోంది. దీంతో పలువురు యువకులు, కుటుంబ పెద్దలు కూడా అప్పుల బారిన పడుతున్నారని స్థానిక కుటుంబాలు చెబుతున్నాయి.
ఈ కార్యకలాపాలు బయటకు తెలియకుండా నిర్వహించుకునేందుకు, కవరింగ్ బాయ్‌లను నియమించి కచ్చితమైన పహారా ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. సమీప గ్రామాలు, మండలాల నుంచి ప్రతిరోజూ లక్షల్లో డబ్బులు పెట్టి జూదగాళ్లు అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతం పూర్తిగా జూద కేంద్రంగా మారిపోయింది.
“మా దగ్గరికి ఏ అధికారి రారు… అధికారులు మా చేతిలోనే ఉన్నారు” అంటూ ఈ గ్యాంగ్ సభ్యులు దర్గాగా ప్రవర్తిస్తున్నారని బాధితులు తెలిపారు. అక్రమంగా జరుగుతున్న ఈ జూదం కారణంగా కొన్ని కుటుంబాలు ఆర్థికంగా కూలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.
స్థానిక గ్రామస్తులు, బాధితులు అధికారులకు విజ్ఞప్తి చేస్తూ—
👉 ఈ పేకాట కేంద్రాలపై దాడులు నిర్వహించాలని
👉 అక్రమ రుణ పోరు, వడ్డీ వసూళ్లపై విచారణ చేపట్టాలని
👉 యువతను జూదపు బానిసల నుండి కాపాడాలని
అభ్యర్థిస్తున్నారు.
ఈ ప్రదేశంలో జరుగుతున్న అక్రమ పేకాటపై సంబంధిత , అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








