V1News Telangana

best news portal development company in india

భైంసా నూతన SDPO రాజేష్ మీనా భద్రతా ఏర్పాట్ల సమీక్ష

SHARE:

భైంసా నూతన SDPO రాజేష్ మీనా భద్రతా ఏర్పాట్ల సమీక్
05-12-2025, నిర్మల్ జిల్లా

భైంసా కొత్త SDPO గా బాధ్యతలు స్వీకరించిన రాజేష్ మీనా, IPS ఈరోజు భైంసా పోలీస్ స్టేషన్‌ను పరిశీలించి, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రజాభద్రత, శాంతి–సమాధానాల పరిరక్షణలో చురుకుగా పనిచేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు.

తర్వాత పట్టణంలోని ముఖ్య కేంద్రాలైన కోతి దేవుడు ఆలయం, పంజేషా మసీదు, జుల్ఫికార్ మసీదు ప్రాంతాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అవసరమైన చోట అదనపు బలగాల మోహరింపు, సీసీ కెమెరా పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని సంబంధిత అధికారులతో చర్చించారు.

అదనంగా, భవిష్యత్తులో ఏర్పాటు చేయనున్న భైంసా SDPO కార్యాలయ స్థలాన్ని పరిశీలించి నిర్మాణ సంబంధిత చర్యలను సూచించారు.

SDPO రాజేష్ మీనా మాట్లాడుతూ

భైంసా పట్టణంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయాల్సిన దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టామని, ప్రజలు నిస్సంకోచంగా జీవించేలా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలతో ఉంటుంది అన్నారు.

ఈ సందర్శనలో SDPO రాజేష్ మీనాతో పాటు ఇన్స్పెక్టర్ నైలు, ఎస్ఐలైన జుబేర్, సుప్రియ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india