V1News Telangana

best news portal development company in india

సర్పంచ్ ఎన్నికల్లో తిరోగమన వ్యవస్థపై ప్రజల్లో అసంతృప్తి

SHARE:

 

“ఉద్దేశం మంచిదే… అమలు మాత్రం గందరగోళంగా” అంటూ ఓటర్ల స్పందన

జిల్లాలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో తిరోగమన వ్యవస్థ  పై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు నామినేషన్ వేసిన కొన్ని రోజుల్లోనే అనూహ్యంగా పెద్ద సంఖ్యలో వెనక్కి తగ్గిపోవడం, కొంతమంది అభ్యర్థులపై ఒత్తిడి తీసుకువచ్చి బలవంతంగా విత్‌డ్రా చేయించారనే ఆరోపణలు వెలువడుతున్నాయి.ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశం ఉండాలి. కాని ఇప్పుడు తిరోగమన వ్యవస్థను కొన్ని ప్రభావశీల వ్యక్తులు తమ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. విత్‌డ్రా అయ్యే వేళ అసలు నిజాలు బయటకు రావట్లేదు” అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కొన్ని గ్రామాల్లో తిరోగమన గడువు ముగిసే ముందు రాత్రి వరకు అభ్యర్థుల ఇళ్ల దగ్గర అనుమానాస్పద కదలికలు కనిపించాయని ప్రజలు చెప్పుకుంటున్నారు.

“భయంతోనా? ఒత్తిడితోనా? లేక డీల్‌తోనా? – ఎవరికీ అర్థం కావడం లేదు” అని ఒక్క కంఠంగా ప్రశ్నిస్తున్నారు.అభ్యర్థుల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోవడంతో, ఎన్నికలు వాస్తవ స్వరూపం కోల్పోతున్నాయన్న అభిప్రాయం పెరిగింది. వ్యతిరేక అభిప్రాయాలు ఉన్న ప్రజలు తమ అభిమతాన్ని వ్యక్తం చేసే అవకాశం కూడా తగ్గిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు.

ఎన్నికల అధికారులు మాత్రం విత్‌డ్రా ప్రక్రియ మొత్తం క్రమబద్ధంగానే జరుగుతుందని చెప్పినప్పటికి, ప్రజల సందేహాలు ఇంకా తొలగలేదు.గ్రామ లో జరుగుతున్న చర్చ ఒకటే తిరోగమన వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలే కానీ, ఇప్పుడు అది కొన్ని మందికే లాభం చేకూరుస్తోంది”

 

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india