నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో వర్గ పోరు భగ్గు మంటుంది. ఒకరిదేమో ఎమ్మెల్యే వర్గం,మరొకరేమో పార్టీ ఇంచార్జ్ వర్గం ఇద్దరు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేసిన బగ్గు మంటదని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఒకరంటే ఇంకొకరికి అసలుకే పడదు ఒకరేమో కాంగ్రెస్ పార్టీ తమకు మద్దతిస్తుందని ఇంకొకరేమో కాంగ్రెస్ పార్టీ పాత మనుషుల మేమంటూ రుద్రూర్ మండల కేంద్రం లో రాజకీయాలు మొదలయ్యాయి. బాన్సువాడ నియోజకవర్గంలో అసలైన కాంగ్రెస్ నాయకులు ఎవరు ఏం వర్గానికి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు అయితదని ప్రజలు ఆలోచనలో పడ్డారు. ఒక వర్గమేమో మేము కాంగ్రెస్ వాళ్ళమని ఇంకో వర్గం నిజమైన కాంగ్రెస్ వాదులం మేమంటునరాట. పార్టీ పరంగా కాకుండా వర్గాల మధ్య ఎన్నికల పోరు మొదలైంది తమ వర్గానికి చెందిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించే పనిలో బాన్సువాడ నియోజకవర్గ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో మాత్రం సర్పంచ్ అభ్యర్థిగా నిలబడిన వ్యక్తులను ప్రజలు ఆలోచనలో పెట్టుకున్నారు పార్టీ ఏదైనా అభ్యర్థి చేసిన అవినీతి మరియు అభ్యర్థి యొక్క ఆలోచనను బట్టి ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయబోతున్నారని కొందరు రాజకీయ మేధావులు చెప్పుకొస్తున్నారు. ఒకే పార్టీకి చెందిన వారు విడివిడిగా పోటీ చేస్తున్నారని గత కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు ఇప్పుడు ఒకరి ఎదుట మరొకరు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి పోటీ చేస్తున్నారని రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామాల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య పోటీ ఉంటుందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








