– నెమ్లి సాయిబాబా ఆలయంలో మరియు పంచముఖ శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహణ
– గ్రామీణ ప్రాంతాలలో యువకులు క్రికెట్ క్రీడ పట్ల అపారమైన ఆసక్తి కనబరుస్తున్నారని అభిప్రాయం వ్యక్తం
– క్రికెట్ క్రీడలో యువకులకు ప్రోత్సాహకాలు అందించి వారి నైపుణ్యాన్ని వెలికి తీస్తామని వ్యాఖ్యలు
– జహీరాబాద్ మాజీ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు బిబి పాటిల్
నసురుల్లాబాద్ ప్రతినిధి:
V1 న్యూస్, నవంబర్ (28) కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో గల సాయిబాబా ఆలయాన్ని గురువారం రోజు భారతీయ జనతా పార్టీ జహీరాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు.. తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు బిబి పాటిల్ పార్టీ శ్రేణులతో కలిసి దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా నియామకం జరిగిన తర్వాత మొదటిసారి ఆలయానికి విచ్చేసి బాబాను దర్శించుకొని.. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో యువకులకు క్రికెట్ క్రీడ పట్ల క్షేత్రస్థాయిలో మెరుగైన సౌకర్యాలు కల్పించి వారి ప్రతిభను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో యువకులు క్రికెట్ క్రీడలో ఎంతో నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ మెరుగైన అవకాశాలు మరియు ఆర్థిక స్తోమతలు సరిగ్గా లేకపోవడం వలన వారి ప్రతిభ ప్రపంచానికి తెలియకుండా కనుమరుగైపోతుందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన యువతను ప్రోత్సహించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు.ఈ సందర్భంగాభారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి బిబి పాటిల్ ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








