రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామానికి మహిళా రిజర్వేషన్ రావడంతో ఈసారి వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో సులేమాన్ నగర్ మాజీ ఎంపీటీసీ గౌస్ సతీమణి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారట పోటీ చేస్తారని ఆయన అనుచరులు సైతం చెప్పుకొస్తున్నారు. 2019వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా లేని సమయంలో హస్తం గుర్తుపై ఎంపిటిసి గా పోటీ చేసి గెలిచిన వ్యక్తి గౌస్. అయితే ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో సైతం తనకే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని మాజీ ఎంపీటీసీ చెప్పుకొస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీల గుర్తులు లేకపోయిన పార్టీ బలగం కార్యకర్తల తోడు ఎంతైనా అవసరం ఉంటుందని ఈసారి సులేమాన్ నగర్ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే మద్దతిస్తదో వారి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సులేమాన్ నగర్ గ్రామస్తులు సైతం చెబుతున్నారు. ప్రజాసేవే లక్ష్యంగా భావించి తనదైన మౌన స్వభావంతో ప్రజలను ఆకట్టుకోవడం ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడం మాజీ ఎంపీటీసీ గౌస్ స్వభావం అయితే రానున్న సర్పంచ్ ఎన్నికల్లో మాజీ ఎంపీటీసీ గౌస్ భార్య పోటీ చేస్తే ఆయనకున్న వర్గంతో పాటు గ్రామంలో కూడా ఎక్కువ మోతాదులో మూడో కంటికి తెలవకుండా మద్దతు దొరికే అవకాశాలు ఉన్నాయట. ఈసారి సులేమాన్ నగర్ లో సర్పంచ్ ఎన్నికలను తక్కువ అంచనా వేయలేమని గెలిచేది ఎవరైనా పోటీ మాత్రం గట్టిగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








