నిజామాబాద్ జిల్లా నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో 24.11.2025 న జరిగిన మహిళ హత్య కేసును, నిజామాబాద్ నార్త్ రూరల్ సర్కిల్ పోలీసులు కేవలం 20 గంటల్లోనే సీసీ కెమెరా క్లూస్ సహాయంతో అద్భుత వేగంతో ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టు లో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
నిందితుడి వివరాలు
పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుడు:
కుమరం @ పాండవల సాగర్ (37), తండ్రి పోశెట్టి, కులం: ST (ఆదివాసి), వృత్తి: వ్యవసాయం, నివాసం: మోస్రా గ్రామం, మండలం & జిల్లా – నిజామాబాదు.
విచారణలో నిందితుడు చేసిన అంగీకార వాంగ్మూలం..
గృహ నిర్మాణానికి అవసరమైన డబ్బుల కోసం, తన మేనకోడలు అయిన ఆకుల అనంత @ సోనీ వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించాలనే ఉద్దేశంతో 24.11.2025 న ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆమె ఒంటరిగా ఉండడంతో గొంతునులిమి హత్య చేసి:
చెవుల్లో ఉన్న కమ్మలు (1.5 గ్రా)
మెడలో ఉన్న బంగారు పుస్తెలు తాడు (13.5 గ్రా)
మాటిలు
దొంగిలించాడు.
తరువాత మృతదేహాన్ని ఇంటి లోపలి గదిలో దాచిపెట్టి, దొంగిలించిన బంగారంలో కొంత భాగాన్ని (1.5 గ్రా కమ్మలు) ముత్తూట్ ఫైనాన్స్, బోధన్ బస్ స్టాండ్ బ్రాంచ్ లో తాకట్టు పెట్టి ₹12,500/- రుణం పొందాడు. మిగిలిన ఆభరణాలను తన వద్దే ఉంచుకున్నాడు.
సంఘటన బయటపడిన వెంటనే పారిపోయిన నిందితుడిని, ఈరోజు ఉదయం నిజామాబాద్ బస్ స్టేషన్ వద్ద పోలీసులు సీపా చేసి అరెస్ట్ చేశారు.
—–స్వాధీనం చేసిన వస్తువులు
బంగారు మాటి – 1.5 గ్రాములు
బంగారు పుస్తెలు తాడు – 13.5 గ్రాములు
LAVA వైట్ కలర్ కీప్యాడ్ మొబైల్
అరెస్ట్ చేసిన టీమ్ వివరాలు
ఈ కేసును నిజామాబాదు ఎ.సి.పి రాజా వెంకట్ రెడ్డి గారి నాయకత్వంలో,
నిజామాబాదు నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి పరిశోధించారు.
నిందితుడిని పట్టుకున్న సిబ్బంది:
ఎస్సై తిరుపతి
ఎస్సై యాదగిరిగౌడ్
ఎస్సై గఫార్
ఏఎస్సై రాజేశ్వర్
క్రైమ్ టీమ్
నవీపేట్ పీఎస్ సిబ్బంది
కేసును వేగంగా ఛేదించినందుకు గౌరవనీయులైన నిజామాబాదు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారు టీంను అభినందించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








