V1News Telangana

best news portal development company in india

భారత రాజ్యాంగ ప్రవేశిక దినోత్సవం: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా నిర్వహణ…

SHARE:

నిజామాబాద్, నవంబర్ 26 :

76వ భారత రాజ్యాంగ ప్రవేశిక దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో రాజ్యాంగ ప్రవేశిక పఠనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ కార్యక్రమం సాగింది.

కార్యక్రమానికి అదనపు డిప్యూటీ కమీషనర్లు శ్రీ బస్వారెడ్డి (అడ్మిన్), శ్రీ రామచందర్ రావు (ఎ.ఆర్) నాయకత్వం వహించారు. రాజ్యాంగ ప్రవేశిక యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ప్రజాస్వామ్య విలువలు, పౌర బాధ్యతలు గురించి వారు స్పష్టంగా వివరించారు. అనంతరం అందరితో కలసి రాజ్యాంగ ప్రవేశికను చదివి ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న శ్రీ తిరుపతి (వెల్ఫేర్), శ్రీ సతీష్ (హోమ్ గార్డ్స్), ఆఫీస్ సూపరింటెండెంట్లు శ్రీ బషీర్, భరోసా సెంటర్ సిబ్బంది, పోలీస్ కార్యాలయ సిబ్బంది, ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, సీసీఆర్‌బీ సిబ్బంది, కంట్రోల్ రూమ్, ఐటీ కోర్, కమ్యూనికేషన్స్ మరియు హోమ్ గార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india