V1News Telangana

best news portal development company in india

రెంజల్ మండలంలోని నీలా–కందకుర్తి గ్రామాల్లో ఎన్నికల అవగాహన సదస్సు..

SHARE:

రాబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి భయాందోళనలేకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ప్రజల్లో అవగాహన పెంపుపై దృష్టి పెట్టింది. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రెంజల్ మండలంలోని నీల గ్రామం మరియు కందకుర్తి గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించారు.

సదస్సుల్లో ఏసీపీ బోధన్ శ్రీ శ్రీనివాస్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ బోధన్ సర్కిల్ శ్రీ విజయ్ కుమార్ గారు, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, అలాగే సంబంధిత గ్రామాల విలేజ్ పోలీస్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

ఎవరికి భయపడకూడదు – ఓటు హక్కు పవిత్రం..

ఈ సందర్భంగా ఏసీపీ శ్రీ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ,
“ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. గ్రామాల్లో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నప్పటికీ, ప్రజలు ఎటువంటి ఒత్తిళ్లకు, బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా ఓటు వేయాలి. పోలీసులు పూర్తి రక్షణ కల్పిస్తారు. ఎన్నికలు పూర్తిగా శాంతియుత వాతావరణంలో జరుగుతాయి” అని స్పష్టం చేశారు.

గ్రామాల ప్రజలు, అన్ని పార్టీల నాయకులు విస్తృతంగా పాల్గొన్నారు

నీలా మరియు కందకుర్తి గ్రామాలకు చెందిన అన్ని రాజకీయ పార్టీలు, గ్రామస్థులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసుల సూచనలను ఆలకించారు. ప్రజలు ప్రశాంత ఎన్నికల కోసం పోలీసులకు తమ సహకారం అందిస్తామని తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india