– రూ.1 కోటి 43 లక్షల వ్యయంతో నిర్మాణం
– గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని అభిప్రాయం వ్యక్తం
– తల్లులు పసిపిల్లల ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు
– బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి జిల్లా:
V1 న్యూస్, నవంబర్ (25) కామారెడ్డి జిల్లా:నసురుల్లాబాద్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ని సోమవారం రోజు ఎంపి సురేష్ షెట్కార్, బాన్సువాడ నియోజకవర్గం శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి,జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, తదితరులు హాజరయ్యి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని గ్రామాల ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రూ.1 కోటి 43 లక్షల వ్యయంతో ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ( PHC) ఆధునిక హంగులతో నిర్మించబడింధని అన్నారు.గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ PHC ని నిర్మించుకోవడం జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యవసర వైద్య సేవలు, ప్రసూతి సేవలు, సాధారణ చికిత్సలు, ప్రయోగశాల సదుపాయాలు మొదలగు వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని.. బలోపేతం దిశగా నిరంతరం కృషి చేస్తుందని, ఈ PHC ద్వారా స్థానికులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు మరింత చేరువ అవుతాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా తల్లులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ బిడ్డలు అనారోగ్యంబారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే తల్లులదే ముఖ్యపాత్ర అని సూచించారు.పరిశుభ్రమైన పరిసరాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలని, ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు పౌష్టికాహారాన్ని అందించాలని, అలాగే శిశువు జన్మించగానే ముర్రుపాలు తాగించాలని, రోగాలబారిన పడి ఆసుపత్రిలో వేలకు వేలు డబ్బు ఖర్చు చేసుకునే బదులు రోగాలు రాకుండా ముందస్తుగా పలు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు.తల్లులు తగిన జాగ్రత్తలు పాటించడం వలన బిడ్డలు రోగాలబారిన పడకుండా కాపాడుకోగలుగుతారని హితవు పలికారు.ఈకార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి ,DMHO విద్య, జిల్లా అధికారులు, వైద్య శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








