– ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి , ఎంపీ సురేష్ షెట్కార్, కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్
– అరకొర వసతులతో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహణ, అసంతృప్తి వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు
– ఎమ్మెల్యేను నిలదీస్తామనే కారణంగా పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారని వివరణ
– ప్రభుత్వ పని తీరుపై మండిపడుతూ నిరసన వ్యక్తం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు
నసురుల్లాబాద్ ప్రతినిధి:
V1 న్యూస్, నవంబర్ (25) కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా మండల నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్ మాట్లాడుతూ సోమవారం రోజు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం ప్రారంభోత్సవానికి నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పనితీరు మరియు ప్రభుత్వ పరిపాలన పట్ల నిలదీస్తామనే ఉద్దేశంతో మమ్మల్ని పోలీసులు ముందస్తు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేత రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమం అనంతరం బిఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ పని తీరుపై మండిపడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు,మామిడి భూమయ్య, డి. సాయిలు, సాయిబాబా గౌడ్, దొంతి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








