నిజామాబాదు జిల్లా లో అక్రమ ఇసుక రవాణా ఆరు పువ్వులు మూడు కాయలుగా కొనసాగుతుంది. ఇష్టం వచ్చినవాడు ఇష్టం వచ్చిన విధంగా తమకున్న బలప్రయోగాలతో అక్రమ రావణాలు కొనసాగిస్తునారు. రాత్రి సమయంలో నిజామాబాదు జిల్లా లోని అడవులున్న ప్రాంతాల్లో మాఫియా రాయులు అక్రమ మొరం రవాణా లు చేస్తున్నారు. అదేవిధంగా మంజీరా నది నుంచి సుంకిని సరిహద్దు ప్రాంతాల నుంచి ఇసుక రావణాలు జరుపుతున్నారని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. నిజామాబాదు జిల్లా లోని మైనింగ్ అధికారులకు సమాచారం అందడం లేదని అధికారులు అక్రమ రావణల పైన స్థానిక ప్రజలు సమాచారం ఇవ్వాలని వారికి సమాచారం అందిన వెంటనే అక్రమ రావణాల పెన చర్యలు తీసుకుంటామని అధికారులు సైతం సిద్ధంగా ఉన్నారట.రాత్రి చివరి సమయం లో అక్రమ రవాణా కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దో నెంబర్ దందా దర్జగా చేస్తున్నారని స్థానిక ప్రజలు మండ్డి పడుతున్నారు. రాత్రి సమయంలో అక్రమ రవాణా చేసే టిప్పర్ లు వేగంగా వెళ్లడం వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయట, ఇసుక మొఱ్ఱం అధికారికంగా అవసరమైతే అధికారుల వద్దకు వెహిబిల్ తీసుకొవచ్చు జీరో లో దో నెంబర్ దందాలు చేస్తూ హీరో ల రౌడీ ఇజానికి పాల్పడుతున్న మాఫియా పై చర్యలు తీసుకోవలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








