– నాయకులు, కార్యకర్తలతో కలిసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్పు
– గొప్ప మనసుతో పలు సేవా కార్యక్రమాలు, ఆర్థిక సహకారాలు నిర్వహిస్తున్న యువ నాయకులు
– దాతృత్వాన్ని చాటుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న వైనం
– బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్
నసురుల్లాబాద్ ప్రతినిధి:
V1 న్యూస్, నవంబర్ (23) :కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామానికి చెందిన చిట్టి వీరయ్య ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్న కూతురు పెళ్లి చేయలేకపోతున్నానని తీవ్రమనస్థాపం చెంది ఇటీవల ఉరి వేసుకొని మరణించారు.. విషయం తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ బాన్సువాడ నాయకులు, NRI కోనేరు శశాంక్ శనివారం రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వీరయ్య కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. రూ.20 వేలు ఆర్థిక సహాయం అందించి వారిని ఓదార్చి మనోధైర్యాన్ని అందించారు. అదేవిధంగా నసురుల్లాబాద్ ఎక్స్ రోడ్ లో నివాసం ఉంటున్న లక్ష్మణ్ రావ్ ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి నెమ్లి సాయిబాబా మందిరం దగ్గర గల డ్రైనేజీలో పడి మృతి చెందారు..లక్ష్మణ్ రావ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.అనంతరం నసురుల్లాబాద్ గ్రామ నివాసి నిరుపేద కుటుంబానికి చెందిన పూసల సురేష్ అనారోగ్యం కారణంగా గత కొద్ది రోజుల క్రితం మరణించారు.. వారి కుటుంబ సభ్యులను కూడా కోనేరు శశాంక్ పరామర్శించి రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబ సభ్యులందరికీ మనో ధైర్యాన్ని అందించి భవిష్యత్తులో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిజెపి కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు, నసురుల్లాబాద్ మండల సీనియర్ నాయకులు అనుసూరి శ్రీనివాస్, అరిగె నారాయణ, అనిల్ గుప్త, గొడిసెల యాదగిరి గౌడ్, కంది పెద్ద మల్లేష్, ఉల్లెంగ గోపి, చందూరి సాయిలు, రామ్ రెడ్డి, నాగరాజ్ గౌడ్, చుక్కన్న గోపి, ర్యాపని మహేష్, కొప్పుల సాయిలు, శేఖర్, ఉల్లెంగ పర్వయ్య, బల్వీర్ సింగ్, ఉల్లెంగ కిష్టయ్య, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








