– ప్రజలందరూ ఆధ్యాత్మిక భావనలతో సన్మార్గంలో జీవించాలి
– పంచముఖ శివాలయం నిర్మాణం చేపట్టడం పూర్వజన్మ సుకృతం అని అభిప్రాయం వ్యక్తం
– తల్లిదండ్రులు భావితరాలకు సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కల్పిస్తూ భక్తి మార్గంలో నడిపించాలి
– సాయిబాబా ఆలయ ధర్మకర్త, NRI పట్లోళ్ల మోహన్ రెడ్డి, శైలజ దంపతులు
నసురుల్లాబాద్ ప్రతినిధి:
V1 న్యూస్, నవంబర్ (21)కామారెడ్డి జిల్లా : నసురుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో గల సాయిబాబా ఆలయ ప్రాంగణంలో నిర్మించిన పంచముఖ శివాలయంలో శుక్రవారం రోజు ఆలయ ధర్మకర్త, ప్రవాస భారతీయులు పట్లోళ్ల మోహన్ రెడ్డి మరియు శైలజ దంపతులు గురు జోషి పీఠాధిపతి (నారాయణఖేడ్), మరియు వేద పండితుల మంత్రోచ్ఛారణల సమక్షంలో పంచముఖ శివుడికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఆధ్యాత్మిక భావనతో సన్మార్గంలో జీవించాలనే సంకల్పంతో సాయిబాబా ఆలయ నిర్మాణాన్ని చెప్పటం జరిగిందని తెలిపారు. మేము అనుకున్న సంకల్పం ప్రకారం నిత్యం ప్రజలు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి మార్గంలో నడవడం పట్ల సంతోషంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా వేద పండితుల సలహాలు, సూచనల ప్రకారం మన ప్రాంతంలో అందుబాటులో లేని పంచముఖ శివాలయాన్ని నిర్మించాలని ధృడ సంకల్పంతో.. వ్యయ ప్రయాసలకు వెనక్కి తగ్గకుండా పంచముఖ శివాలయం నిర్మాణం చేపట్టి భక్తులకు అందుబాటులోకి తేవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలియజేశారు. ఇదేవిధంగా భవిష్యత్తులో కూడా ప్రజలందరూ పాశ్చాత్య సంస్కృతిని విస్మరించి.. ఆధ్యాత్మిక భావనలతో సన్మార్గంలో జీవిస్తూ భావితరాలకు కూడా మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పిస్తూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, పాడిపంటలు సమృద్ధిగా పండి సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పీఠాధిపతి గురు జోషి ,వేద పండితులు మోహన్ రెడ్డి, శైలజ దంపతులకు ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








