సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తరఫున నిజామాబాద్ జిల్లాలో మరో గర్వకారణం!.
రైతు అభివృద్ధికి అగ్రగామిగా నిలిచిన సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం…
రాష్ట్ర సహకార యూనిట్ నుంచి ‘ఉత్తమ ప్రతిభా పురస్కారం’తో సత్కారం…
హైదరాబాద్లో జరిగిన 72వ సహకార వారోత్సవాల్లో సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కు రాష్ట్ర స్థాయి గుర్తింపు…
ప్రెసిడెంట్ అల్లె జనార్ధన్ – సీఈవో బస్వంతరావుకు ఘన సన్మానం..
రైతు సేవలో ఆదర్శంగా నిలిచిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం … రాష్ట్ర స్థాయిలో మెరిసిన ప్రతిభ…
నిజామాబాద్ జిల్లా పరిధిలోని సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మరో విశిష్ట గుర్తింపు సాధించింది.
రైతులకు సమగ్ర సేవలు అందించడం, వ్యవసాయ అభివృద్ధిలో వినూత్న చర్యలు చేపట్టడం వంటి అనేక రంగాల్లో ఉత్తమ ప్రతిభ చాటినందుకు రాష్ట్ర సహకార యూనిట్ వారు సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ను ‘ఉత్తమ ప్రతిభా పురస్కారం’కు ఎంపిక చేశారు.

గురువారం హైదరాబాద్లోని రాష్ట్ర సహకార యూనిట్ కార్యాలయంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు అల్లె జనార్ధన్, సీఈఓ బస్వంతరావు ఉత్తమ ప్రతిభా పురస్కారాన్ని స్వీకరించారు.
వీరికి నల్గొండ డిసిసిబి చైర్మన్ మరియు టిఎస్ ఆగ్రోస్ చైర్మన్ బాలరాజు చేతుల మీదుగా మెమెంటోలు అందజేయడంతో పాటు శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్లు, సహకార సంస్థల ప్రజాప్రతినిధులు మరియు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఈ అవార్డు సాధించడం స్థానికంగా ఆనందాన్ని నింపింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









