– సేవా దృక్పథంతో అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న వైనం
– బాధిత కుటుంబానికి రూ.5000 ఆర్థిక సహాయం అందజేత
– భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని భరోసా
– బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్
బాన్సువాడ ప్రతినిధి:
V1 న్యూస్, నవంబర్ (18) కామారెడ్డి జిల్లా : బాన్సువాడ పట్టణానికి చెందిన బిజెపి బూత్ కమిటీ కార్యదర్శి చామకూర సాయిలు భార్య గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది దీంతో చామకూర సాయిలు భార్య చనిపోయిందన్న బెంగతో తీవ్ర అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక బిజెపి నాయకుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గం బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్ బాధిత కుటుంబానికి రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు బాధితుడు యోగక్షేమలను అడిగి తెలుసుకొని ఓదార్చారు.. త్వరగా కోలుకోవాలని ధైర్యాన్ని అందించారు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా బాధితుడికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆర్థిక సహాయం అందజేసినందుకు బాధిత కుటుంబ సభ్యులు NRI కోనేరు శశాంక్ కు మరియు స్థానిక బిజెపి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి కామారెడ్డి జిల్లా కార్యదర్శి పయ్యాల శంకర్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








