V1News Telangana

best news portal development company in india

కార్తీక మాసంలో ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్న పంచముఖ శివాలయం….

SHARE:

 

 

– భక్తుల రద్దీతో కిటకిటలాడిన నెమ్లి సాయిబాబా మందిరం

 

– పంచముఖ శివాలయంలో స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహణ

 

– భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి దీపాల కాంతుల్లో మొక్కులు చెల్లించుకున్న మహిళలు

 

– సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు, శివ నామస్మరణలతో మారుమోగిన ఆలయ ప్రాంగణం

 

నసురుల్లాబాద్ ప్రతినిధి:

 

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో గల తెలంగాణ షిరిడి సాయి బాబా మందిరంగా పిలవబడే ఆలయ ప్రాంగణంలో నిర్మించిన పంచముఖ శివాలయంలో విశ్వసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం , త్రయోదశి ఆఖరి సోమవారమును పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వేద పండితుల సమక్షంలో భక్తిశ్రద్ధలతో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు స్వామివారికి వివిధ రకాల దీపాలను వెలిగించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ మరియు దీపాల కాంతులతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అనంతరం భక్తులు సతీ సమేతంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతమును నిర్వహించారు. శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారు మోగిపోయింది.. అనంతరం భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి.. కోరిన కోరికలు నెరవేర్చాలని శివుడిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల మౌళిక వసతులు కల్పించారు. చాలా అరుదుగా కనిపించే పంచముఖ శివాలయాన్ని భక్తుల సౌకర్యార్థం సాయిబాబా ఆలయ ప్రాంగణంలో నిర్మించినందుకుగాను భక్తులు ఆలయ ధర్మకర్త పట్లోళ్ల మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india