ఇనుప స్తంభం ప్రాణాలకు ముప్పు… అధికారులు మాత్రం మౌనం.
ఇంట్లోకే ఎర్తింగ్! తొలగించాలని విజ్ఞప్తి… స్పందించని అధికారులపై ప్రజల ఆవేదన
. తట్టికోట్లో విద్యుత్ ముప్పు పెరుగుతోంది… వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ప్రజల డిమాండ్. ప్రమాదం ఎదుట నిలబడిన ప్రజలు… ‘స్తంభం తొలగించండి’ అంటూ పలుమార్లు విన్నవించినా స్పందన లేని అధికారులు..
బోధన్, తట్టికోట్:
ప్రణాళిక లేకపోవడం, నిర్లక్ష్యమే అన్నట్టు బోధన్ పట్టణంలోని తట్టికోట్ ప్రాంతంలో ప్రమాదకరంగా వాలి ఉన్న ఇనుప కరెంట్ స్తంభం స్థానికులకు బెడదగా మారింది. ఎప్పుడెప్పుడు కరెంట్ లీకై ప్రమాదం జరుగుతుందో తెలియని భయంతో ప్రజలు రోజూ భయబ్రాంతులకు గురవుతున్నారు.
స్థానికులు పలుమార్లు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించినా, ఎక్కడో ఏదో జరిగితేనే కదలిక అన్నట్టు అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఇంట్లోకే ఎర్తింగ్ వస్తోంది… చిన్నారులు బయట ఆడుకునే సమయంలో ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు” అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇనుప స్తంభం పూర్తిగా దెబ్బతిని ఏ క్షణమైనా కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నందున, ప్రమాదం జరగకముందే వెంటనే చర్యలు తీసుకోవాలని, స్తంభాన్ని తొలగించి కొత్త స్తంభం ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల ప్రాణాలు పణంగా పెట్టేలా ఉన్న ఈ పరిస్థితిపై అధికారులు తక్షణమే స్పందించి ప్రమాదాన్ని నివారించాల్సిన అవసరం ఉందని ప్రజలు స్పష్టం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









