నిజామాబాద్ జిల్లాలో మేము ఏజెంట్లు మేము విదేశాలకు పంపుతాము అని చాలామంది విదేశలకు పంపే కార్యాలయలను ఏర్పాటు చేసుకొని పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారట. విదేశాలకు వెళ్లి తమ కుటుంబాలను పోషించాలనే ఉద్దేశంతో ఎంతో మంది నిరుపేద కుటుంబాలు ఇల్లు బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి విదేశాలకు తమ పిల్లలను పంపుతున్నారు. ఉన్నత చదువులు చదివిన ఉద్యోగాలు రాక ఇంట్లో ఉన్న పేదరికాన్ని కళ్ళతో చూడలేక ఇంట్లో నుండి ఒకరు బయట దేశానికి వెళ్తే ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు సర్దుకుంటాయని తల్లిదండ్రులు తమ పిల్లలను విదేశాలకు పంపుతున్నారు. కొందరు దీన్ని ఆసరాగా చేసుకుని విదేశాల్లో మంచి ఉద్యోగం ఉందని అక్కడ వెళ్తే లక్షల్లో డబ్బులు సంపాదించావచ్చని అబద్ధాలను నిజం రూపం లో చూపెడుతూ విదేశాలకు పంపుతారు. అక్కడ వెళ్లిన తర్వాత వాళ్లు పంపించిన పని ఉండదు నెలల తరబడి కూర్చొని ఉండటం చేపిన పని దొరకక విదేశలో యజమానులు పెట్టె టార్చెర్ అంత ఇంత ఉండదట నెలల తరబడి పనులు చేయించుకున్న జీతాలు ఇవ్వకపోవడం అడిగితే బయపెట్టడం లాంటి జరుగుతున్నాయి. ఒకరికి మోసం జరిగిందని బాధితులు ఫిర్యాదు చేస్తే మిగతా ఎజెంట్లు తప్పించుకుంటారు కొన్ని రోజులు నిలకడగా ఉండి మళ్ళీ యధావిధిగా మోసాలు చేయడం మొదలు పెడతారట నిజామాబాద్ జిల్లా ఉన్నత స్థాయి అధికారులు ఫేక్ గల్ఫ్ ఏజెంట్ల పై ప్రత్యేక దృష్టి సారించి ఫేక్ ఏజెంట్ల నుండి ప్రజలు మోసపోకుండా కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








