దేశ రాజధాని ఢిల్లీ మరోసారి షాక్‌కు గురైంది. ఎర్రకోట సమీపంలోని మెట్రో పార్కింగ్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఎర్రకోట గేట్ నం.1 వద్ద పార్కింగ్‌లో ఉన్న ఒక కారులో అజ్ఞాతవశాత్తు పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
స్పాట్‌కు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. పేలుడు కారణం ఇప్పటివరకు ఖచ్చితంగా తెలియరాలేదు. బాంబ్ లేదా గ్యాస్ సిలిండర్ పేలుడు కావచ్చని ప్రాథమిక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సమీపంలోని రోడ్లను పోలీసులు మూసివేశారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








