V1News Telangana

best news portal development company in india

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక – నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసిన బోధన్ రూరల్ పోలీసులు..

SHARE:

బోధన్ రూరల్, నవంబర్ 2:
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలం పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. సాలూర మండలంలోని ఖాజాపూర్, హుంసా, మందర్నా గ్రామాల పరిధిలో గత కొద్ది రోజులుగా ట్రాక్టర్లు, ఆటోల ద్వారా యథేచ్ఛగా ఇసుక రవాణా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం అందడంతో బోధన్ రూరల్ పోలీసు శాఖ అప్రమత్తమైంది.

ఆ సమాచారం మేరకు ఈరోజు ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు సుడిగాలి దాడులు నిర్వహించి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి మాట్లాడుతూ,

> “అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై ఎటువంటి సడలింపు ఉండదు. పట్టుబడిన వాహనాలపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఇకపై ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు,” అని హెచ్చరించారు.

అలాగే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ,

> “ఎవరైనా అక్రమ ఇసుక రవాణాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయి,” అని తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india