V1News Telangana

best news portal development company in india

మహా ధాన్యం రవాణాపై అనుమానాల ముసురు..!

SHARE:

 అధికారుల నిర్లక్ష్యంతో మహా ధాన్య దందా..!?. రేషన్ బియ్యానికి కేసు – లారీ ధాన్యానికి వెసులుబాటు..!? 
సరిహద్దు చెక్‌పోస్టుల్లో అక్రమ రవాణా ఆటలు..!?కుమ్మక్కయిన మిల్లర్లు–అధికారులు? ధాన్య రవాణాపై అనుమానాల మబ్బు?
రైతుల పంటకు న్యాయం ఎప్పుడు..? మహారాష్ట్ర ధాన్యం తెలంగాణ మార్కెట్‌లోకి ఎలా?
మహా ధాన్యం రవాణాపై అనుమానాల ముసురు..!
బోధన్, నవంబర్ 2:
మహారాష్ట్ర నుండి అనుమతులు లేకుండా తెలంగాణలోకి వస్తున్న ధాన్యపు లారీలను పౌరసరఫరా అధికారులు కేసులు నమోదు చేయకుండానే వెనక్కి పంపడం వివాదానికి దారి తీసింది.
ఇదే అధికారులు రేషన్ డీలర్ ఒక సంచి బియ్యం విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటారన్న వాస్తవం రైతుల్లో ఆగ్రహం రేపుతోంది.

రాష్ట్ర సరిహద్దుల్లోని సాలూర, ఖండ్‌గాం, కందకుర్తి చెక్‌పోస్టుల్లో గత వారం నాలుగు లారీలు పట్టుబడ్డప్పటికీ ఎటువంటి కేసులు నమోదు కాకపోవడం పలు అనుమానాలకు కారణమవుతోంది.
పట్టుబడిన లారీలలో ధాన్యం తేమశాతం 18 శాతం దాటినప్పటికీ, అధికారులు వాటిని తిరిగి మహారాష్ట్రకు పంపించడమే కాక, సంబంధిత వ్యక్తులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ప్రశ్నార్థకంగా మారింది.

మిషన్ యజమానులు–ఏజెంట్లు–మిల్లర్ల కుమ్మక్కా..?

స్థానిక సమాచారం ప్రకారం కొందరు కోత మిషన్ యజమానులు, ఏజెంట్లు, రైస్ మిల్లర్లు మరియు చెక్‌పోస్టుల్లో ఉన్న కొందరు అధికారులు కుమ్మక్కై అక్రమ రవాణాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల నుంచి తక్కువ ధరకు పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసి తెలంగాణ మార్కెట్లలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం.

రైతులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “మేము ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్యూలలో నిలబడి వేచి చూస్తుంటే, కొందరు బారిన పడిన ధాన్యాన్ని లారీల్లో తెచ్చి ఇక్కడే అమ్మేస్తున్నారు. ఇది మాకు అన్యాయం” అని ఆరోపిస్తున్నారు.

అధికారుల నిఘా పెరిగినా రవాణా ఆగలేదు..?

ధాన్యం అక్రమ రవాణా అరికట్టేందుకు సాలూర, బోధన్, రెంజల్ మండలాల్లో ఉమ్మడి చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, పోలీసు–రెవెన్యూ–వ్యవసాయ శాఖ సిబ్బంది 24 గంటల పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
అయినా అక్రమ రవాణా ఆగకపోవడం వ్యవస్థలో లోపాలు ఉన్నాయనే వాదనకు బలం చేకూరుస్తోంది.

రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ,
“మహారాష్ట్ర ధాన్యం Telangana మార్కెట్‌ల్లోకి రావడాన్ని అడ్డుకుని, దీనికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india