V1News Telangana

best news portal development company in india

ఐడీఓసీలో కలెక్టర్, సీపీతో భేటీ అయిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బాధిత కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించారు.

SHARE:

ఐడీఓసీలో కలెక్టర్, సీపీతో భేటీ అయిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
బాధిత కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించారు
నిజామాబాద్, నవంబర్ 1:
రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం నాడు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇతర అధికారులతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా పోలీసు, రెవెన్యూ, ఎస్సీ–ఎస్టీ అభివృద్ధి మరియు సంక్షేమ శాఖల అధికారులతో కలిసి అట్రాసిటీ కేసుల పురోగతి, షెడ్యూల్డ్ కులాలు–తెగలు ఎదుర్కొంటున్న సమస్యలు, సబ్‌ప్లాన్ నిధుల వినియోగం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల నుండి నిధుల కేటాయింపులు, వినియోగ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అలాగే బాధితుల నుండి పలు విజ్ఞాపనలు స్వీకరించారు. ఐడీఓసీ చేరుకున్న కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి పూలమొక్క అందించి స్వాగతం పలికారు.

తరువాత చైర్మన్ బక్కి వెంకటయ్య సీ.సీ.ఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌కుమార్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమోద్‌కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన కానిస్టేబుల్ మరణం బాధాకరమని, బాధిత కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా కమిషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

చైర్మన్ వెంట ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india