Post Views: 103
నవీపేట్ మండలం మిట్టాపూర్ శివారులో మహిళ దారుణ హత్య — సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్, నవంబర్ 1 :
నవీపేట్ మండలం మిట్టాపూర్ శివారులో గుర్తు తెలియని మహిళ (వయస్సు సుమారు 20 నుండి 40 సంవత్సరాల మధ్య)ను దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహం తల, కుడి చేయి మణికట్టు వరకు లేకుండా ఉండటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ స్వయంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధారాలను సేకరించే దిశగా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించాయి. ఘటనను ఛేదించేందుకు పది ప్రత్యేక బృందాలను (స్పెషల్ టీమ్స్) ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఏసీపీ రాజా వెంకటరెడ్డి, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నవీపేట్ ఎస్సై సిహెచ్. తిరుపతి తదితర అధికారులు కమిషనర్‌తో కలిసి పరిశీలనలో పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









