V1News Telangana

best news portal development company in india

“భారతదేశ ఉక్కుమనిషి”కి జన్మదినం సందర్భంగా ఘన నివాళులు…

SHARE:

 

 

– ఎస్సై రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా “రాష్ట్రీయ ఏక్తా దివస్”కార్యక్రమం నిర్వహణ

 

– 2k రన్ లో పాల్గొన్న వందమంది గురుకుల పాఠశాల విద్యార్థులు

 

– జాతీయ ఐక్యత నినాదాలతో హోరెత్తిస్తూ రన్ లో పాల్గొన్న పోలీసులు, యువకులు

 

– దేశ ప్రజలను ఐకమత్యం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు ఎంతో గొప్పవని కొనియాడిన ఎస్సై రాఘవేంద్ర

 

నసురుల్లాబాద్ ప్రతినిధి:

 

కామారెడ్డి జిల్లా : “భారతదేశ ఉక్కుమనిషి” సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 31 న రాష్ట్రీయ ఏకతా దివస్ జరుపుకుంటారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యతను పెంపొందించడానికి అన్ని పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులతో జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచనల మేరకు శనివారం రోజు కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల ఎస్సై రాఘవేంద్ర ఆధ్వర్యంలో “జాతీయ ఐక్యత” దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన సిబ్బందితో కలిసి మండల కేంద్రంలో గల గురుకుల పాఠశాలలో ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి విద్యార్థులతో “జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ” చేయించారు. అనంతరం 100 మంది విద్యార్థులతో 2k రన్ జెండా ఊపి ప్రారంభించారు. మండల కేంద్రంలో రోమాలు నిక్కపొడుచుకునేలా జాతీయ ఐక్యతా నినాదాలతో రన్ నిర్వహించి లింగంపల్లి తండా వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా ఎస్సై రాఘవేంద్ర మాట్లాడుతూ భారతదేశ ప్రజలను ఐకమత్యం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. వారు దేశానికి అందించిన సేవల వల్ల అపారమైన గౌరవం మరియు ప్రశంసలను తెచ్చిపెట్టిందని అన్నారు. ఆయన వారసత్వాన్ని మరియు జాతీయ ఐక్యత కొరకు వారు చేసిన నిరంతర కృషిని స్మరించుకోవడానికి భారత ప్రభుత్వం 2014 లో అక్టోబర్ 31న “రాష్ట్రీయ ఏక్తా దివస్”అధికారికంగా ప్రకటించిందని తెలిపారు. భారతదేశ చరిత్ర, సంస్కృతి మరియు వైవిద్యం గురించి అవగాహన పెంచే విధంగా వివిధ విద్యా కార్యకలాపాలు మరియు కార్యక్రమాల ద్వారా ఈరోజు గుర్తించబడిందని పేర్కొన్నారు. ఇది దేశ ఏకీకరణ సమయంలో ఎదుర్కొన్న క్లిష్టమైన సవాళ్ల గురించి యువతరానికి అవగాహన కల్పిస్తుందని తెలియజేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india