V1News Telangana

best news portal development company in india

నిజామాబాదులో స్కూల్ బస్సుల తనిఖీలు — విద్యార్థుల భద్రతే లక్ష్యం . స్కూల్, ప్రైవేట్ బస్సులపై పోలీసులు – మోటార్ వాహన శాఖ సంయుక్త తనిఖీలు లైసెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ల లేని బస్సులపై చర్యలు

SHARE:

విద్యార్థుల భద్రతకే ప్రాధాన్యం – నిజామాబాద్ కమిషనరేట్ చర్యలు
. బస్సుల తనిఖీలలో లోపాలు– డ్రైవర్లకు హెచ్చరికలు..
నిజామాబాద్‌, అక్టోబర్ 30:
విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులపై విస్తృత తనిఖీలు నిర్వహించారు.

గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, పోలీసులు మరియు మోటార్ వాహనాల శాఖ సంయుక్తంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా అధికారులు వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ఇన్స్యూరెన్స్ వివరాలు వంటి అంశాలను పరిశీలించారు.
నియమాలను ఉల్లంఘించిన వాహనాలపై కేసులు నమోదు చేసి, సంబంధిత డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు.

విద్యార్థుల ప్రాణ భద్రతకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని, నిర్లక్ష్యం వహించే వాహన యజమానులు, డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india