ఏర్గట్ల :
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా యువత డ్రగ్స్ మరియు చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు కబడ్డీ టోర్నమెంట్‌ను ఏర్గట్ల పోలీస్ స్టేషన్ వారు నిర్వహించారు.
ఆర్మూర్ డివిజన్ పరిధిలోని తాళ్ల రాంపూర్ గ్రామంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్‌లో వివిధ ప్రాంతాల నుండి 16 జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., గారు ముఖ్య అతిథిగా హాజరై మ్యాచ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ —
“యువత దేశ భవిష్యత్తు. మీరు ఆరోగ్యంగా ఉండి మంచి ఆశయాలతో ముందుకు సాగాలి. క్రీడలు మానసిక, శారీరక దృఢతను పెంపొందిస్తాయి. డ్రగ్స్ మరియు చెడు వ్యసనాలు జీవితాన్ని నాశనం చేస్తాయి. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు సన్మార్గంలో నడిపించే సాధనాలుగా ఉంటాయి” అని పిలుపునిచ్చారు.
తదుపరి విజేత క్రీడాకారులకు కమిషనర్ గారు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, భీంగల్ సీఐ సత్యనారాయణ, ఏర్గట్ల ఎస్‌ఐ రాజేశ్వర్, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, 16 కబడ్డీ జట్ల యువకులు పాల్గొన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








