V1News Telangana

best news portal development company in india

తగ్గెల్లి పాఠశాలలో క్రీడలు ఆడటానికి సౌకర్యాలు కరువు.

SHARE:

సాలూర:
సాలూర మండలంలోని తగ్గెల్లి మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో క్రీడా సౌకర్యాల కొరత విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోంది. సోమవారం రోజు విద్యార్థులు రెండు పక్కల పిల్లలను నిలబెట్టి తాత్కాలికంగా కోకో ఆటను ఆడుతున్న దృశ్యాన్ని v1news కెమెరా క్లిక్ చేసింది.

ప్రతి సంవత్సరం అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలలోనూ ప్రతిభ కనబరచాలని సూచనలు చేస్తూ ఉంటారు. అయితే ఆ సూచనలు అమలవ్వాలంటే పాఠశాల స్థాయిలో అవసరమైన మౌలిక సదుపాయాలు ఉండాలని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.

క్రీడా మైదానం, క్రీడా సామగ్రి వంటి సౌకర్యాలు ఉంటే విద్యార్థులు మరింత ఉత్సాహంగా పాల్గొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో పాఠశాలలో అవసరమైన క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పలు రాజకీయ పార్టీల నాయకులు విద్యాశాఖను కోరుతున్నారు.

ఈ విషయమై స్పందించిన సాలూర మండల విద్యాశాఖ అధికారి రాజీ మంజుష తెలిపారు—“తగ్గెల్లి పాఠశాలలో విద్యార్థులు ఆటలు ఆడుకునేలా అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసే చర్యలు తీసుకుంటాం” అని అన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india