V1News Telangana

best news portal development company in india

సులేమాన్ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ లొల్లి…2014 సంవత్సరంలో ఇల్లులు లేకుండా 400 పైగా బిల్లులు లేపుకున్నారని ఆరోపించిన మాజీ సర్పంచ్…

SHARE:

రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామంలో గత ప్రభుత్వ హాయంలో కట్టిన 55 డబుల్ బెడ్రూంలో తమకు న్యాయం జరగలేదని కొందరు తమ పేరిట బిల్లులు లేపుకున్నారని సులేమాన్ నగర్ గ్రామంలోని కొందరు వ్యక్తులు జిల్లాస్థాయి వరకు వెళ్లి ఫిర్యాదులు చేసి మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది.

 

ఈ విషయాన్ని ఖండిస్తూ సులేమాన్ నగర్ మాజీ సర్పంచ్ ఖాదర్ ఈ రోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తము అందరికీ న్యాయం చేశామని గత ప్రభుత్వ హాయంలో కట్టిన 55 డబుల్ బెడ్రూంలో వచ్చిన లిస్టు పై స్థాయి అధికారులు పరిశీలించిన తర్వాతనే 2బిహెచ్కే డబుల్ బెడ్ రూమ్లో కట్టామని ఆ 14 మంది తమకు సోమత లేదని వాళ్లంతట వారే కట్టుకోలేదని ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో ఆ 14 మంది లో 6గురికి సాంక్షన్ చేశామని మిగితా వారితో పాటు గ్రామం లో అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ పథకం లో అర్హత కలిగిస్తామని మాజీ సర్పంచ్ మీడియా ముందుకు వచ్చి తెలపడం జరిగింది.

2014వ సంవత్సరంలో సులేమాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ పథకం లో 682 ఇల్లులు సాంక్షన్ అయ్యాయని, అందులో కేవలం 200 మందికి బిల్లు రాగా మిగతా 400కు పైగా గ్రామస్తుల బిల్లులను కొందరు నాయకులు లేపేసుకున్నారని, ఇప్పుడు ఇందిరమ్మ పథకం కింద ఆన్లైన్లో అప్లై చేయడానికి వెళితే గతంలో తమ పేరిట బిల్లులు సాంక్షన్ అయ్యాయని అధికారులు చెబుతున్నారని ఇప్పుడు ఆన్లైన్ చేయడానికి తమకు కష్టమవుతుందని సులేమాన్ నగర్ గ్రామస్తులు నిరాశ చెందుతున్నారని సులేమాన్ నగర్ మాజీ సర్పంచ్ ఖాదర్ తెలిపారు. 400కు పైగా ఇందిరమ్మ పథకంలో కట్టిన ఇల్లులు ఎక్కడున్నాయో చూపెట్టాలని బాన్సువాడ ఎమ్మెల్యే గా బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నప్పుడు ఆయన అనుచరులు ఇలాంటి అవినీతికి పాల్పడ్డారని గతంలో 682 ఇల్లులు ఉన్నాయని బిల్లులు లేపుకుని కేవలం 200 మందికే బిల్లులు వచ్చాయని మిగితా వారికీ ఇవ్వలేదని తము ఎన్నో మార్లు చెప్పిన పట్టించుకోలేదని ఇప్పుడు అర్హులైన వారికి ఇందిరమ్మ పథకంలో  ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అర్హత లేనట్టు చూపెడుతుందని దీనికి కారకులైన వారు ఎవరో వారిపైన చర్యలు తీసుకొని అర్హులైన పేదవారికిి న్యాయం చేయాలని సులేమాన్ నగర్ మాజీ సర్పంచ్ ఖాదర్ కోరారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india