Post Views: 204
భైంసా పట్టణంలోని శ్రీ అన్నపూర్ణ క్షేత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజులుగా నిర్వహించిన పూర్ణాహుతి చండీయాగం ముగింపు కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముధోల్ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్ మరియు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








