Post Views: 80
ప్రజావాణి కార్యక్రమంలో 11 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్..
నిజామాబాద్, అక్టోబర్ 27:
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., గారు ప్రజల నుండి వచ్చిన పలు ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మొత్తం 11 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఫిర్యాదుదారుల సమస్యలను చట్టప్రకారం పరిష్కరించేలా సూచనలు ఇవ్వడంతో పాటు, ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని కమిషనర్ పిలుపునిచ్చారు.
జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం ప్రజలతో మరింత దగ్గరయ్యి, శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ప్రజా సమస్యలకు వేగంగా స్పందించడం అని కమిషనర్ గారు తెలిపారు.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








