బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించిన మున్సిపల్ కార్మికులు.
మృతి చెందిన మున్సిపల్ కార్మికురాలికి 50 లక్షల ఎక్స్ గైసియా ఇవ్వాలి,
ఇందిరమ్మ డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి ఆదుకోవాలి
కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల డిమాండ్
సోమవారం నాడు బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల గాంధీ పార్క్ ఎదురుగా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికు ర్యాలీగా విధులు నిర్వహిస్తున్న రాజం నాగమణి కి సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్ అతివేగంగా వచ్చి గుద్దుకొని సుమారు 50 ఫీట్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది ఆమె ఎడమ కాలు నుజ్జునుజ్జు అయింది ఇంకా శరీరంలో అనేక గాయాలయ్యాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ఆసుపత్రిలో డాక్టర్లు లేరని నిజామాబాద్ కు రిఫర్ చేశారు. అక్కడ కూడా వెళ్లిన తర్వాత రెండు గంటలు తర్వాత వైద్యము చేయడం ప్రారంభించారు అయినప్పటికీ ఆమె మృతి చెందారు.
ఆ వార్త విన్న కార్మికులు టి యు సి ఐ, ఐఎఫ్టియు, ఆమ్ ఆద్మీ పార్టీ, మాజీ వైస్ చైర్మన్ ఖాదర్ తదితరుల ఆధ్వర్యంలో మృతి చెందిన కార్మికురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ మున్సిపల్ కార్యాలయం ముందు అట్లాగే సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బయటాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకున్నారు.
మృతి చెందిన కార్మికురాలికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఇందిరమ్మ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని, వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఆందోళన చేయడం జరిగింది. సబ్ కలెక్టర్ వికాస్ మహాతో గారికి డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టి యు సి ఐ రాష్ట్ర నాయకులు బి. మల్లేష్, ఐ ఎఫ్ టి యు నాయకులు డి.పోశెట్టి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు జువేద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఖదీర్ తదితరులు మాట్లాడుతూ బస్సు యాక్సిడెంట్ లో చనిపోయిన రాజం నాగమణికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇయ్యాలని, యాక్సిడెంట్ చేసిన బస్సు డ్రైవర్ నుండి ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుండి నష్టపరిహారం ఇప్పించాలని, ప్రభుత్వపరంగా ఇందిరమ్మ డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, మున్సిపల్ వారు ఉదయము పనులు చేయించేటప్పుడు కార్మికులకు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కార్మికులకు అందరికీ డ్రెస్సులు ఇవ్వాలని, కార్మికులను వేధింపులకు గురి చేయొద్దని, మహిళల చేత పురుషులు చేసే పనులను చేయిస్తూ ఇబ్బందులకు గురి చేయొద్దని డిమాండ్ చేశారు.
దీనితో చర్చలు జరిపిన సబ్ కలెక్టర్ వికాస్ మహా తో డిమాండ్లన్నింటిని కలెక్టర్ మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మృతి చెందిన రాజ నాగమణి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బి పర్వయ్య, బి.గంగామణి, బి. గంగారాం, యు. శివ, లాలయ్య, భూమయ్య, పోశెట్టి, లావణ్య, మరుబాయి, అబ్బయ్య, అశోక్, కృష్ణ, జగదీష్, బి.రాజు, జె. రమేష్, ఎం. గంగాధర్, జి. రాజు మరియు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








