Post Views: 284
నిజామాబాద్, అక్టోబర్ 24:
గత వారం గాయపడిన సయ్యద్ ఆసిఫ్‌ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారు నేడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌నగర్‌లో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.

ఆసిఫ్ ఆరోగ్యం గురించి ఆరా తీసిన కమిషనర్, అతని భవిష్యత్తుపై పూర్తి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ కుమారుడు అయాన్‌ను ఎత్తుకుని, “తుంహార పాప బహదూర్ హై” అని ముద్దుగా సంబోధిస్తూ అభినందించారు.

కమిషనర్ పరామర్శతో ఆసిఫ్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్, రూరల్ ఎస్ఐ ఎమ్.డి. అరిఫ్, టౌన్–6 ఎస్ఐ వెంకట్‌రావు, అలాగే స్థానిక కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








