V1News Telangana

best news portal development company in india

ఫిట్స్ వచ్చి పడిపోయిన వ్యక్తికి సహాయం చేసిన ట్రాఫిక్ సిబ్బంది సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్..

SHARE:

నిజామాబాద్, అక్టోబర్ 24:
బోధన్ బస్టాండ్ సమీపంలో అరటిపండ్ల బండి పెట్టుకొని వ్యాపారం చేస్తున్న వ్యక్తి కరీముకు ఆకస్మికంగా ఫిట్స్ (ఎపిలెప్సీ) రావడంతో అక్కడికక్కడే పడిపోయాడు. ఈ సంఘటనను గమనించిన ట్రాఫిక్ శాఖకు చెందిన ఏఆర్‌ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు తక్షణమే స్పందించి బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆయన సోదరుడిని సంప్రదించి బాధితుడిని సురక్షితంగా ఇంటికి చేరేలా చర్యలు తీసుకున్నారు.

అంతేకాక, మానవతా దృక్పథంతో ట్రాఫిక్ సిబ్బంది తమ తరఫున బాధిత కుటుంబానికి రూ.500/- నగదు సహాయం అందించారు.

ఈ ఉదారతకు, ప్రజాసేవ పట్ల చూపిన మనసుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారు ట్రాఫిక్ సిబ్బంది కోటేశ్వర్‌రావును అభినందించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india