సాలూరు చెక్‌పోస్ట్‌లో రాత్రివేళల్లో ప్రభుత్వ ఆస్తుల దోపిడీ కలకలం
ప్రజల్లో ఆగ్రహం – అధికారులు నిర్లక్ష్యం పట్ల విమర్శలు
సాలూరు, అక్టోబర్ 23:
సాలూరు ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లో తరలింపు ఘటన పెద్ద ఎత్తున కలకలం రేపింది. గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆర్టీఏ. (ప్రావెట్ )అసిస్టెంట్లు తమ సొంత వాహనంలో చెక్‌పోస్ట్‌కు చెందిన ఫర్నిచర్ సామాగ్రిని తమ ఇళ్లకు తరలిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు.
వారిని ప్రశ్నించగా “మాకు మా సార్ తీసుకెళ్ళమన్నాడు” అని సమాధానం ఇచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రాత్రి వేళల్లో ప్రభుత్వ సామాగ్రిని తరలించడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి? ఎవరి ఆదేశాలపై ఈ చర్య జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చెక్‌పోస్ట్‌ను ఎత్తివేసిన తర్వాత అక్కడ మిగిలిన ప్రభుత్వ ఆస్తులను కొందరు సిబ్బంది రహస్యంగా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు అధికారులు, సిబ్బంది కూడా ప్రమేయం ఉన్నట్లు సమాచారం.
“ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సినవారే వాటిని దోచుకుంటున్నారు” అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “సాలూరు చెక్‌పోస్ట్‌లో మాఫియా రాజ్యం నడుస్తోంది” అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత ఇళ్లకు తరలించిన వాహనం ఎవరిది? ఈ చర్య వెనుక ఉన్నవారు ఎవరు? వారిపై వెంటనే సోదాలు జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఉన్నతాధికారులు ఈ ఘటనపై తక్షణ విచారణ జరిపి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, చెక్‌పోస్ట్ పరిసరాల్లో రాత్రివేళల్లో జరుగుతున్న అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








