V1News Telangana

best news portal development company in india

🔹 తెలంగాణలో రవాణా శాఖ చెక్‌పోస్టులన్నీ రద్దు 🔹

SHARE:

🔹 తెలంగాణలో రవాణా శాఖ చెక్‌పోస్టులన్నీ రద్దు ,

అక్టోబర్‌ 22 (ప్రత్యేక ప్రతినిధి):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ ఆధీనంలోని అన్ని చెక్‌పోస్టులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రవాణా కమిషనర్‌ కార్యాలయం ఈ మేరకు నేడు మెమో నం.1254/E/2024 ద్వారా ఉత్తర్వులు విడుదల చేసింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం అన్ని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులు తక్షణమే చెక్‌పోస్టుల వద్ద ఉన్న కార్యకలాపాలను నిలిపివేయాలి. చెక్‌పోస్టు వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లు, సైన్‌బోర్డులు తొలగించి వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
అలాగే అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ఆయా డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాలకు బదిలీ చేయాలని, చెక్‌పోస్టుల్లో ఉన్న రికార్డులు, ఫర్నిచర్‌, పరికరాలు, కంప్యూటర్లను సంబంధిత డీటీవో కార్యాలయాలకు తరలించాలని సూచించారు.
చివరగా అన్ని అధికారులూ చెక్‌పోస్టు మూసివేత, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ, రికార్డుల సమీక్షకు సంబంధించిన అనుగుణత నివేదికను ఈరోజు సాయంత్రం 5 గంటలలోగా రవాణా కమిషనర్‌కు సమర్పించాలని ఆదేశించారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india