Post Views: 334
బోధన్ టౌన్, అక్టోబర్22 (ప్రతినిధి):
రోజువారీ కష్టాల అనంతరం కొద్దిసేపు సేదతీరడానికి తాగే కల్లు ఇప్పుడు ప్రజా ఆరోగ్యానికి ప్రమాదంగా మారింది. స్వచ్ఛమైన కల్లు అందకపోవడంతో కొంతమంది కల్లు సొసైటీలు కృత్రిమంగా తయారు చేసిన కల్లుని విక్రయిస్తున్నాయి. భారీ విరాళాలు అందుకోవడంతో గ్రామాభివృద్ధి కమిటీలు కూడా నిశ్శబ్దంగా చూడటమే మిన్నగా భావిస్తున్నాయి.
పట్టణ పరిసరాల్లోని బోధన్ బైపాస్, నాగన్‌పల్లి, బోధన్–నాందేడ్ రహదారి పక్కన కల్లు షాపులు పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటికి కావాల్సిన సరఫరా స్థానిక కల్లు డిపోల నుంచే జరుగుతోంది.?
రసాయనాలతో కృత్రిమ కల్లు తయారీ.?
కల్తీ కల్లు తయారీలో క్లోరో హైడ్రెడ్, డైజోఫామ్, అల్ట్రాజోలం వంటి ప్రమాదకర రసాయనాలను కలుపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటి వలన నాడీవ్యవస్థ దెబ్బతిని, ఆరోగ్య సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కల్తీ కల్లు సేవించిన తరువాత కొంతమంది విచిత్రంగా ప్రవర్తించడం, తలనొప్పి, వాంతులు, చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం..

కల్తీ కల్లు తయారీ, విక్రయం గురించి ఎక్సైజ్ అధికారులు, గ్రామాభివృద్ధి కమిటీలు బాగా తెలుసుకున్నప్పటికీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఒకే లైసెన్స్‌పై పలు చోట్ల షాపులు నడుస్తున్నా కూడా అధికారులు మౌనం వహిస్తున్నారు.
పేరుకే దాడులు చేసి ‘చేతులు దులుపుకునే’ పరిస్థితి నెలకొంది. ప్రజల్లో కల్లు దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్న అధికారులు వాస్తవానికి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు.
ప్రజల విజ్ఞప్తి..
ప్రతి సంవత్సరం గ్రామాభివృద్ధి కమిటీలకు లక్షల్లో విరాళాలు అందుతుండగా, ప్రజల ఆరోగ్యంపై మాత్రం అవి కన్నెత్తి చూడటం లేదు. పేద, మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరకు లభించే “కిక్కిచే” కల్లు వైపు ఆకర్షితులవుతున్నారు.
స్థానిక ప్రజలు ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృత్రిమ కల్లు తయారీ, విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....











