Post Views: 69
బోధన్ రూరల్, 19 అక్టోబర్ 2025(వి1న్యూస్) : బోధన్ రూరల్ మండలంలోని అమ్దాపూర్, చిన్నమావంది గ్రామాల్లో పేకాట స్థావరాలపై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించి 8 మందిని అదుపులో తీసుకున్నారు. బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… అమ్దాపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి రూ 6,180./- నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే చిన్నమావంది గ్రామ శివారులో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులో తీసుకుని వద్ద నుండి రూ 5,000./- నగదు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పేకాట ఆడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Author: మీ వి1 న్యూస్ సీఈవో పేండ్కర్ శ్రీనివాస్
వి1 న్యూస్ పత్రిక, ఛానల్ లో పని చేయుటకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల, మండలాల పాత్రికేయలు కావలెను. సంప్రదించాల్సిన నంబర్లు : 9603925163 - 9834485832








