Post Views: 353
పేకాట స్థావరంపై CCS టీమ్ దాడి — 9మంది అరెస్ట్
నిజామాబాద్, అక్టోబర్ 16 (వీ1 న్యూస్):
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS గారి ఆదేశాల మేరకు, CCS ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో CCS సీఐలు సురేష్, సాయినాథ్, ఎస్ఐ గోవింద్ మరియు సిబ్బంది ప్రత్యేక దాడి నిర్వహించారు.
ఈ దాడి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగస్థాన్–1లో ఉన్న లక్ష్మీ నరసింహ అపార్ట్మెంట్ వద్ద జరిగింది. అక్కడ జరుగుతున్న పేకాట స్థావరంపై రైడ్ చేసి, 9మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.
అంతేకాకుండా, వారివద్ద నుండి ₹49,250 నగదు, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కోసం రూరల్ పోలీస్ స్టేషన్ SHOకి అప్పగించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








