తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికలు మరియు మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే వచ్చే మునిసిపల్ ఎన్నికల్లో బోధన్ పట్టణంలోని అన్ని వార్డులో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఉంటారని ప్రజాసేవ లక్ష్యంగా భావించి బోధన్ పట్టణంలోని 38 వార్డులలో తమ అభ్యర్థులను నిలబెడతామని ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ నియోజకవర్గ ఇంచార్జి జూనేద్ అహ్మద్ తెలిపారు. ఎన్నో సంవత్సరల నుండి తను ప్రజాసేవ లక్ష్యంగా భావించి సోషల్ మీడియాలో ప్రజా సమస్యల పై పోరాడుతున్నానని న్యాయంగా ప్రజాసేవ చేసే అభ్యర్థులను ఎంపిక చేసి అన్ని వార్డు లో పోటీ చేస్తామని గెలుపు ఓటమి తనా లక్ష్యం కాదని ప్రజాసేవ చేయడమే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య ఉద్దేశమని ఆప్ పార్టీ ఇన్చార్జ్ జునేద్ అహ్మద్ మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు కంటే తక్కువ బిల్లు వస్తే కరెంట్ బిల్లులను సైతం ఉచితంగా చేశారని. అదేవిధంగా పంజాబ్లో ఆప్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పంజాబ్ ప్రజలకు కూడా అన్ని సౌకర్యాలు అందించారాని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమకు ఆశీర్వదిస్తే ప్రజాసేవ లక్ష్యంగా భావించి పని చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జి జూనేద్ అహ్మద్ ఖలీల్ తెలిపారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








