Post Views: 171
*_తక్షణమే స్థానిక ఎన్నికలు జరపాలి.._*_హైకోర్టులో పిటిషన్ దాఖలు_
_హైదరాబాద్, అక్టోబర్ 15 : స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది._
_మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం కొత్త కొమ్ముగూడెం గ్రామానికి చెందిన రెంక సురేందర్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జారీచేసిన జీవో 9 అమలును మాత్రమే హైకోర్టు నిలిపివేసిందని, ఎన్నికల ప్రక్రియను నిలిపివేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది నలిమెల వెంకటయ్య పేరొన్నారు. ఈ పిటిషన్ను హైకోర్టు శుక్రవారం విచారించే అవకాశం ఉన్నది._
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








