V1News Telangana

best news portal development company in india

*డిజిటల్ చెల్లింపుల రంగంపై దృష్టి.. పీఓఎస్ డివైజ్‌లను లాంచ్ చేసిన జోహో…*

SHARE:

మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు సవాలు విసురుతున్న జోహో సంస్థ.. ఫిన్ టెక్ రంగంపై కూడా తన పట్టుబిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా పీఓఎస్ డివైజ్‌లను లాంచ్ చేసింది. త్వరలో వీటిని అరట్టై యాప్‌తో కూడా లింక్ చేస్తామని తెలిపింది.

డిజిటల్ చెల్లింపుల రంగంలో పాతుకుపోయిన ఫోన్ పే, జీపే, పేటీఎమ్‌కు సవాలు విసిరేందుకు అరట్టై రూపకర్త, జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు సిద్ధమయ్యారు.
ఆయన సారథ్యంలోని జోహో తాజాగా పాయింట్‌ ఆఫ్ సేల్ డివైజ్‌లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. వీటి సాయంతో వ్యాపారులు కస్టమర్ల నుంచి నేరుగా చెల్లింపులు స్వీకరించగలుగుతారు. తన సాఫ్ట్‌వేర్‌ ఎకోసిస్టమ్‌తో ఈ డివైజెస్‌ను ఏకం చేయాలనే వ్యూహంతో సంస్థ ముందుకెళుతోంది.
దేశీ యాప్ అరట్టైతో జోహో పే చెల్లింపుల వ్యవస్థను త్వరలో అనుసంధానం చేస్తామని శ్రీధర్ వెంబు తెలిపారు!

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india