– భక్తిశ్రద్ధలతో గణపతి, గౌరమ్మకు ప్రత్యేక పూజలు, పసుపు, కుంకుమలు చల్లగా కాపాడాలని వేడుకోలు
– ఒకరికొకరు గాజులు ధరించుకొని, మిఠాయిలు తినిపించుకుని మురిసిపోయిన వైనం
– చిన్ననాటి జ్ఞాపకలతో చూడముచ్చటగా ఆటపాటలతో ఆనందంగా గడిపిన ఆడపడుచులు
నసురుల్లాబాద్ ప్రతినిధి:
V1 న్యూస్, అక్టోబర్ (14) కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజు శ్రీకృష్ణ యాదవ సంఘం మహిళలు నూతన వస్త్రాలను ధరించి అందరూ కలిసి రామాలయం వద్ద “గాజుల ఉత్సవం” కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా వారు అయ్యవారి వేదమంత్రాల నడుమ మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా గణపతి, గౌరీ పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించి తమ పసుపు కుంకుమలను చల్లగా కాపాడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా వారు పరస్పరం పసుపు కుంకుమలు, గోరింటాకు పంచుకొని.. ఒకరికొకరు గాజులు ధరించుకున్నారు. అనంతరం ఆత్మీయంగా మిఠాయిలు తినిపించుకుని “గాజుల ఉత్సవాన్ని” ఆటపాటలతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదేవిధంగా మహిళలమందరం ఐకమత్యంగా ఒక దగ్గరికి చేరి గాజుల ఉత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని అందరము కలిసి ఆటపాటలు ఆడుతూ సంతోషంగా జరుపుకున్నామని తెలియజేశారు. నిత్యం కుటుంబ బాధ్యతలతో విరామం లేకుండా గడిపే తాము ఇలాంటి కార్యక్రమాల వల్ల మనసుకు ఊరటగా ఉంటుందని అన్నారు.తమ పసుపు కుంకుమలు చల్లగా కాపాడడంతో పాటు గ్రామంలోని ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో , పాడిపంటలు సమృద్ధిగా పండి ఆనందంగా జీవించాలని వేడుకున్నామని తెలిపారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








