Post Views: 220
నిజామాబాద్,అక్టోబర్13:చలికాలం సమీపిస్తున్న నేపథ్యంలో విధుల నిర్వహణలో పోలీసు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు చర్యలలో భాగంగా నిజామాబాద్ పోలీసు కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐపీఎస్ గారు ఈరోజు ఎ.ఆర్ మరియు సివిల్ పోలీసు సిబ్బందికి ఉలెన్ జాకెట్లు, హావర్ సాక్సులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,
“విధి నిర్వహణలో వాతావరణ మార్పులు ప్రభావం చూపుతాయి. చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా విధి భాగమే. అందువల్ల ప్రతి ఒక్కరు ఈ ఉలెన్ జాకెట్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలి,” అని సూచించారు.
కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ శ్రీ సంతోష్ రెడ్డి, ఆర్ఎస్ఐలు నిషిత్, సుమన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








