V1News Telangana

best news portal development company in india

బోధన్‌లో వర్షాల కారణంగా రైతులు నష్టపోయారు – మాజీ ఎమ్మెల్యే షకీల్​ వర్షాలతో రైతులు నష్టపోయారు – వెంటనే పరిహారం చెల్లించాలంటూ షకీల్ డిమాండ్ . 22 నెలల్లో ఒక్క హామీ నెరవేర్చలేదు – మాజీ ఎమ్మెల్యే షకీల్ విమర్శలు . బోధన్ రైతుల బాధలపై మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆవేదన

SHARE:

బోధన్, అక్టోబర్ 11:ఇటీవల కురిసిన వర్షాల కారణంగా బోధన్ నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే షకీల్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
Oplus_16908288
ఈ సందర్భంగా మాట్లాడుతూ షకీల్ అన్నారు – “ఇటీవల వర్షాల ప్రభావంతో పంటలు దెబ్బతిన్నా ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి సాయం అందించలేదు. రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సైతం పట్టించుకోకపోవడం విచారకరం” అని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. “అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచినా ఒక్క హామీని కూడా ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చలేకపోయింది. బోధన్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఒక్క రూపాయీ జరగలేదు” అని అన్నారు.
Oplus_16908288
ఈ సందర్భంగా షకీల్ “కాంగ్రెస్ బాకీ కార్డులు” విడుదల చేస్తూ, “ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు బాకీ పడింది” అని విమర్శించారు. అలాగే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కనీసం వారానికి ఒక్కరోజైనా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు…

.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india