– అంగరంగ వైభవంగా డప్పుల చప్పుల్లతో గ్రామంలో శోభయాత్ర నిర్వహణ
– భక్తి పారవశ్యంతో మంగళ హారతులు పట్టిన మహిళలు
– అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు,ఆటపాటలతో అమ్మవార్లకు ఘన స్వాగతం
– నసురుల్లాబాద్ గ్రామా భివృద్ధి కమిటీ
నసురుల్లాబాద్ ప్రతినిధి:
V1 న్యూస్, అక్టోబర్( 11) కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గ్రామ దేవతలైన పెద్ద పోచమ్మ, నల్ల పోచమ్మ, గండి మైసమ్మ, పోత లింగన్న, ఆరెల్లి పోచమ్మ, భూ లక్ష్మమ్మ, గజ్జలమ్మ, ఊరడమ్మ, విగ్రహాల పునః ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా శుక్రవారం రోజు అమ్మవార్ల విగ్రహాలను గ్రామంలోని అన్ని వీధుల గుండా అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో మంగళహారతులతో శోభాయాత్రలో పాల్గొన్నారు. భక్తులు అడుగడుగునా అమ్మవార్ల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులందరూ డప్పుల చప్పులతో,ఆటపాటలతో , బాణాసంచా పేల్చుతూ సంబరాలు నిర్వహించారు. అనంతరం పెద్ద పోచమ్మ గుడి ప్రాంగణంలో ఏర్పాటుచేసిన యాగశాలలో ఘనాపాటి జోషి మధుసూదన్ శర్మ వేద పండితుల సమక్షంలో మంత్రోచ్ఛారణల నడుమ యజ్ఞం నిర్వహించారు. అనంతరం నూతనంగా ప్రతిష్టించబోయే విగ్రహాలను పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు కంది మల్లేష్, మాజీ సర్పంచ్ అరిగె సాయిలు, గ్రామ పెద్దకాపు అయినాల లింగం, గురుస్వామి కూని సాయ గౌడ్, రామకృష్ణారెడ్డి,విజయ్ కుమార్ రెడ్డి, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








